Union Budget 2018 TAX, GDP, Reforms on Agenda | Oneindia Telugu

2018-02-01 2,078

Finance Minister Arun Jaitley will present the Union Budget 2018 in Parliament on Thursday. Continuing with the trend from last year, the Railways Budget will be included in the General Budget. This is the last full Budget of the government led by Prime Minister Narendra Modi before the country goes to polls in 2019.

న్యూఢిల్లీ: 2018-19 వార్షిక బడ్జెట్‌ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న గురువారం అంటే.. ఈ రోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అంతకంటే ముందు బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించనుంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌ను తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు బయలుదేరారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం కానున్న కేంద్ర క్యాబినెట్, జైట్లీ బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలుపనుంది. మరోవైపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బడ్జెట్ ప్రతులు పార్లమెంట్‌కు కూడా చేరాయి. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి కేవలం ఒక గంట ముందు మాత్రమే ఈ బడ్జెట్ ప్రతులు కేంద్ర మంత్రుల చేతికి అందుతాయి. బడ్జెట్‌.. అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక 6 నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ తయారీకి సంబంధించిన కొన్ని విశేషాలు... మీకోసం.